మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 38వ చిత్రం, ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌లో నాలుగో భాగమైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider Man Brand New Day) భారత్‌లో విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో భారతీయ సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి ‘యూఏ 13+’ (UA 13) సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
ఈ చిత్రంలో యువ నటుడు టామ్ హాలండ్ సరసన టాలెంటెడ్ బ్యూటీ జెండాయా కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రసిద్ధ నటి సేడీ సింక్, జాకబ్ బాటలాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా, భారత్‌లో జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, భారత్‌లో విడుదలయ్యే వెర్షన్ కోసం సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు మరియు చేర్పులను సూచించింది.
సెన్సార్ నిబంధనల ప్రకారం, సినిమాలోని రెండు ముద్దు సన్నివేశాలను (Kissing scenes) మేకర్స్ తొలగించాల్సి వచ్చింది. అలాగే మూడు చోట్ల వచ్చే అభ్యంతరకర సంభాషణలను ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్‌లోనూ మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. వీటితో పాటు చిత్రంలో మద్యపానానికి సంబంధించిన హెచ్చరిక బోర్డును విధిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. అన్ని కట్స్, సెన్సార్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ సినిమా మొత్తం 144 నిమిషాల 52 సెకన్ల (సుమారు 2 గంటల 25 నిమిషాలు) రన్‌టైమ్‌తో థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
