టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా జరుగుతున్న మెగా – నందమూరి ఫ్యామిలీ వార్‌లో నేను కూడా ఉన్నాను అంటూ తల దూర్చింది శ్రీరెడ్డి. నాగబాబు బాలయ్యపై చేస్తోన్న కామెంట్స్‌పై స్పందించింది శ్రీరెడ్డి. బాలయ్య బాబును విమర్శిస్తున్న మెగా బ్రదర్ నాగబాబును విమర్శిస్తు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ మొత్తన్ని ఓ ఆట ఆడుకుంది శ్రీరెడ్డి. ప్రజారాజ్యంతో మొదలుపెట్టి, జనసేన పార్టీ వరకు పలు కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ముఖ్యంగా పవన్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడింది శ్రీరెడ్డి. పవన్ అంటే దొంగ కోళ్లు పట్టుకునే వాడిలా అటూ,ఇటూ చూస్తు ఉంటాడు అతనే కదా పవన్ అంటూ మాట్లాడింది. ఇక్కడ పేర్లు,అక్కడ పేర్లు చెబుతు పిచ్చి వాడిలా మాట్లాడతాడని చెప్పుకొచ్చింది. పెళ్లిల మీద పెళ్లిల పెళ్లిళ్లు చేసుకుంటు , దేశభక్తి అని మాట్లాడతాడని.ఎలక్షన్ల ముందు వచ్చి ఏదేదో అనేసి, జగన్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు.
జగన్ అభిమానులు ఏకం అయితే మీరు మిగలరని మాట్లాడింది.ఏదో పిల్లి పిత్తిరి పిల్లల్ని వేసుకుని ఓ తెగ హడవిడి చేస్తున్నాడు. యూఎస్‌కి వెళ్లి అక్కడ డబ్బులు అడుగుతు అడ్డంగా బుక్కైన నువ్వు, మీ ఫ్యామిలీ నీతి గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు,వేదాలు వర్ణించినట్లుందని తెలిపింది. ఇదే సమయంలో బాలయ్య ఎవరో నాకు తెలియదని చెప్పిన నాగబాబుపై కొన్ని సెటైర్లు వేసింది శ్రీరెడ్డి.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు