టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో పొరాటానికి సిద్ధం అయింది. ఈసారి తన పొరాటం సీని ఇండస్ట్రీ మీద కాకుండా సామాజిక సేవ మీద దృష్టి పెట్టినట్లు ఉంది.మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టీంగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి ,ఇప్పుడు తన పోరాటాన్ని సామాజిక సేవ వైపు తరలిచింది.ప్రకాశం జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తోంది. ఎర్రగొండ పాళెం మండలంలోని, గురిజే పల్లి గ్రామంలో ఉపాధిపనులను పేదలకు ఇవ్వడం లేదంటూ కూలీలతో కలిసి, రోడ్డుపై భైఠాయించి ధర్నా చేసింది.
ఆమె శ్రీశైలం వెళ్తుండగా ధర్నా చేస్తున్న కూలీలను చూసి, కారు దిగేసి, వారితోపాటు తలకు గుడ్డ కట్టి రోడ్డుపై భైఠాయించింది. శ్రీరెడ్డిని చూసిన అక్కడ వారు అవాక్కయ్యారు.శ్రీరెడ్డి ఏంటీ ఇలా తమకు మద్దతు ఇస్తుంది అని వారు విస్తుపోతున్నారు.కొంతసేపు అక్కడ హడవిడి చేసిన శ్రీరెడ్డి తరువాత తన కారులో అక్కడ నుండి వెళ్లిపొయింది.