టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ మీద తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే.తాను చేస్తున్న పోరాటానికి తెలుగు చిత్రపరిశ్రమ స్పందించటం లేదంటూ.. ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేయటం ద్వారా ఆమె పెను సంచలనానికి తెరతీశారు.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం పడుకోవాలని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. . క్యాస్టింగ్ కౌచ్ తో పాటు ,కొన్ని అంశాల మీద సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆమె పలువురి విమర్శలు ఎదుర్కొన్నారు.
తన సంచలన వ్యాఖ్యలతో తమిళ మీడియాలో తళుక్కుమంటున్న శ్రీరెడ్డి.. ఈ మధ్యన రెడ్డి డైరీ పేరుతో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని,ఈ చిత్రం తమిళ నటికి సంబంధించినదిగా చెబుతోంది శ్రీరెడ్డి. తాను నటిస్తున్న రెడ్డి డైరీ బయోపిక్ కాదని వెల్లడించింది. వేరే నటి కథ అని చెప్పటం ద్వారా కొత్త సస్పెన్స్ కు తెర తీసింది. ఈ చిత్రంలో తానొక పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్లుగా వెల్లడించింది.