- Advertisement -
టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో వివాదానికి తెర లేపింది.ఈసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కాకుండా పొలిటికల్ పార్టీ వారిని టార్గెట్ చేసింది.ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.పవన్ కల్యాణ్ తన పర్యటనలో నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై స్పందించిన శ్రీరెడ్డి..నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అసలు శ్రీరెడ్డి పవన్ టార్గెట్ చేసిందో,నారా లోకేష్‌పై సెటైర్ వేసిందో ఎవరికి అర్థం కావడం లేదు.