వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేస్తున్న సంచలన ఆరోపణలు, చూపిస్తున్న ఆధారాలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖుల్ని వరుసగా టార్గెట్ చేయడంతో… మాతో పాటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు బెంబెలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని ప్రముఖులు హడిలి పోతున్నారు.
ఈ లీక్స్ వ్యవహారం శ్రీరెడ్డి, కోనవెంకట్ మధ్య వార్‌కు దారి తీసింది. తాజాగా శ్రీరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కోన వెంకట్ ట్విట్టర్‌లో’వివరణ ఇచ్చారు. తనతో పాటూ మరికొంతమందిపై ఓ నటి చేస్తున్న ఆరోపణలు చూసి షాకయ్యాను… దీనిపై పోలీసులతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవాలను బయటపెట్టి ఎవరైనా దోషులని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకట్.
శ్రీరెడ్డి సినీ రచయిత కోన వెంకట్ గురించి చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనుక కోన వెంకట్ కు ఓ గెస్ట్ హౌస్ ఉంది. ఒక రోజు రాత్రి 9 గంటలకు ఆయన నన్ను పిలిచాడు. వీవీ వినాయక్ కూడా కాసేపట్లో ఇక్కడకు వస్తున్నాడు… నిన్ను పరిచయం చేస్తా అని పిలిచాడు. సినిమాలో అవకాశం వస్తుందేమోనని వెళ్లా. అక్కడకు వెళ్లిన తర్వాత మందు తాగుతావా అని కోన అడిగాడు. నాకు అలవాటు లేదని చెప్పా. ఆ తర్వాత నన్ను శారీరకంగా బలవంతం చేశాడు. ఈ దారుణాన్ని నేను నిరూపిస్తా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చింది. ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.