Thursday, May 8, 2025
- Advertisement -

‘శ్రీమంతుడు’ వసూళ్ల వివరాల ప్రకటనతో మెగాఫ్యామిలీకి సవాల్!

- Advertisement -

‘శ్రీమంతుడు’ సినిమా వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. 25 రోజుల వసూళ్లు అంటూ.. నిర్మాతలు ఈ ప్రకటన చేశారు. విడుదల అయిన 25 రోజుకు తమ సినిమా ఇంత వసూళు చేసిందని వారు ఘనంగా ప్రకటించారు.

వారు చెబుతున్న వివరాల ప్రకారం.. శ్రీమంతుడు సినిమా 25 రోజులకు గానూ ఓవరాల్ గా 154 కోట్ల రూపాయలను వసూళ్లను సాధించింది. గ్రాస్ గా ఈ సినిమా ఆ స్థాయిని అందుకొంది. షేర్ గా చూస్తే ఈ సినిమా వసూళ్లు 95 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది!

సినిమా ఇంకా రన్నింగ్ లోనే ఉంది. ఇంకా పాతిక రోజులే.. ఇప్పుడప్పుడే మరో భారీ సినిమాలు ఏవీ లేవు.. దీంతో ఈ సినిమాకు మరింత రన్ ఉన్నట్టే అనుకోవాలి. దీన్ని బట్టి శ్రీమంతుడు సినిమా వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం విశేషమే కాదు. షేర్ వసూళ్లే వంద కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఇప్పుడు ప్రకటన చేయడం మెగా ఫ్యామిలీకి ఒక సవాలే అని చెప్పవచ్చు.

ఒకవైపు మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వసూళ్ల ఫిగర్ ను ఈ విధంగా ప్రకటించడం ద్వారా.. మెగాఫ్యామిలీకి సవాలు విసిరారు. ఎలాగూ ఇప్పుడు మెగా ఫ్యామిలీ సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రకటనతో.. వారిని రెచ్చగొట్టినట్టే అవుతోంది. మొన్నటివరకూ టాలీవుడ్ లో వసూళ్ల రికార్డులు అన్నీ మెగా ఫ్యామిలీ పేరు మీదే ఉండేవి. ఇప్పుడు వరసగా బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు ఆ రికార్డులను అధిగమించాయి.. తుడిచేశాయి. మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఏ రేంజ్ వసూళ్లతో వీటికి సమాధానం ఇస్తుందో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -