Saturday, May 18, 2024
- Advertisement -

ఫ‌స్ట్ లుక్‌లోనే క‌న‌బడుతుందిగా….

- Advertisement -

తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించిన విభిన్నమైన కథా చిత్రాలలో, ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ ఒకటి.జంబ లకిడి పంబ.. ఈ పేరు వినగానే నవ్వు వచ్చేసేంతటి కామెడీ పంచిన సినిమా అది. కామెడీ చిత్రాలలో ఓ ట్రెండ్ సెట్టర్. అదే టైటిల్ తో ఇప్పుడు మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ నటుడి పాత్రలతో పాటు అడపా దడపా హీరోగాను మెరుస్తున్న శ్రీనివాసరెడ్డి.. జంబ లకిడి పంబ అంటూ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌ లుక్ ను రిలీజ్ చేశారు.పోస్టర్ కు ఓ వైపున హీరో శ్రీనివాస రెడ్డి కూర్చుని.. అద్దం పట్టుకుని తన పెదాలకు లిప్ స్టిక్ రాసుకుని మురిసిపోతూ ఉంటాడు.

అదే సోఫాకు మరోవైపున కూర్చున్న హీరోయిన్ సిద్ధి ఇద్నాని.. సిగరెట్ తాగుతూ పోజ్ ఇచ్చిన విధానం బాగుంది. అయితే ఈ పాత కాన్సెప్టును దర్శకుడు మురళీకృష్ణ కొత్తగా ఎలా చెప్పనున్నాడు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘గీతాంజలి’ .. ‘ఆనందో బ్రహ్మ’ వంటి సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీనివాసరెడ్డికి, ఈ సినిమా మరింత క్రేజ్ ను తీసుకొస్తుందేమో చూడాలి. సినిమా మొత్తం ఇదే స్థాయిలో తీయగలిగితే మాత్రం.. కచ్చితంగా ఈ కామెడీ సినిమా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -