మెగాఫ్యాన్స్ కు ఒక స్వీట్ న్యూస్ . రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తున్న బ్రూస్ లీ సినిమా కు పవర్ స్టార్ వాయిస్ ఇస్తున్నాడు.
సినిమా స్టార్టింగ్ లో పవన్ కల్యాణ్ హీరో పాత్రను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంత తగ్గింది. జల్సా సినిమా వచ్చిన సమయంలో ఇదొకట్రెండ్. ఆ సినిమాకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పటికీ ఆసక్తికరమైన విషయమే. మరి ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకొనేలా ఉంది, ఎందుకంటే.. ఇక్కడ పవర్ స్టార్ , మెగా పవర్ స్టార్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.
అభిమానులకు ఇంతకు మించిన స్వీట్ న్యూస్ లేదు. ఎందుకంటే… మెగా ఫ్యామిలీలో విబేధాలు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమానికి కూడా పవన్ హాజరు అయినా… విబేధాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో చరణ్ సినిమాకు పవన్ వాయిస్ ఇస్తే.. అది కచ్చితంగా విబేధాల వార్తలకు బ్రేక్ ని ఇచ్చేదే అవుతుంది. ఇది ఫ్యాన్స్ కు ఇచ్చే ఆనందం అదనం!