సుకుమార్ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు.రాజమౌళి తరువాత అంతటి పేరున్నా దర్శకుడు సుకుమార్. హిట్లు , ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. సుకుమార్‌ని టాప్ దర్శకులలో నిలబెట్టిన సినిమా 1 నేనొక్కిడినే. మహేశ్ బాబు హీరోగా నటించిని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించనప్పటికి దర్శకుడిగా సుకుమార్‌కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా నుంచే స్టార్ హీరోలు సుకుమార్‌కు సినిమాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక గతేఏడాది సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఇండస్ట్ర్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో సుకుమార్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా తరువాత మళ్లీ మహేశ్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
అయితే చివరి నిమిషంలో మహేశ్‌తో సినిమా క్యాన్సిల్ అయింది. తన కథతో మహేశ్‌ని మెప్పించలేకపోయాడు. దీంతో వెంటనే హడావిడిగా బన్నితో తన తరువాత సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. బన్ని ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తరువాత కాని సుకుమార్ సినిమాను మొదలుపెడతాడు. త్రివిక్రమ్ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తి అవ్వడానికి కనీసం 8 నెలలు పట్టింది. సుకుమార్‌తో సినిమా కూడా మరో ఆరు నెలలు పట్టింది. అంటే మూడు సంవత్సరాల పాటు సుకుమార్ నుంచి సినిమాను ఆశించకూడదు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు ఇలా మూడు సంవత్సరాల పాటు ఖాళీగా ఉండటం అంటే మామూలు విషయం కాదు.