- Advertisement -

షోలో కింద‌ప‌డిన సుమ‌..! రేటింగ్ కోస‌మా?

- Advertisement -

తెలుగు యాంకర్స్ చాలామంది ఉన్నా సుమ‌కు ఉన్నా క్రేజ్ వేరు.అస‌లు తెలుగులో యాంక‌రింగ్‌కు క్రేజ్ తీసుకువ‌చ్చిన ఘ‌న‌త సుమ‌కే ద‌క్కుతుంది. కేర‌ళ అమ్మాయి ఉండి తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం సుమ ప్ర‌త్యేక‌త. ఇప్ప‌టికి వ‌న్నె తగ్గ‌ని అందంతో యాంక‌రింగ్‌కు నిండుత‌నం తీసుకువ‌స్తుంది సుమ.

అయితే తాజాగా ఓ టివిలో ప్రొగ్రామ్‌లో సుమ కింద‌ప‌డిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఈటివిలో ప్ర‌సార‌మైయ్యే క్యాష్ ప్రొగ్రామ్ ఎంట్రీ సాంగ్ కోసం ప‌డ‌వ ఎక్కిన సుమ,దుర‌దృష్ట‌వశాత్తు ప‌డ‌వ పైనుండి కింద ప‌డింది.దీంతో షో నిర్వ‌హాకులు భ‌యంతో వ‌ణికిపోయారు.హూట‌హూటిన ఆమెకు ఏం జ‌రిగిందో అని ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు.అయితే ఆమెకు ప్ర‌మాదం జ‌రిగిందో లేదో మాత్రం తెలియలేదు.ఈ వీడియా సుమ కింద‌ప‌డే వ‌రుకే క‌ట్ చేయ‌డంతో చాలామంది ఆమెకు ప్ర‌మాదం జ‌రిగింద‌నే భావిస్తున్నారు.

అయితే మ‌రికొంత మంది ఈ వీడియోపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.షో రేటింగ్స్ కోసం ఇదోక టెక్నిక్ అని వారు అంటున్నారు.గ‌తంలో షో రేటింగ్స్ కోసం ఇలాంటివి చాలా చేశార‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.అయితే ప్రొగ్రామ్ ఈ రోజు(శ‌నివారం) టెలీకాస్ట్ కానుంది.ప్రమాదం ఎలా జ‌రిగిందో మ‌నం కూడా ఓసారి చూసేద్దాం రండీ!

https://youtu.be/uoWAf9FPJG4

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -