Friday, May 3, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్‌’లో ఏఎన్నార్ అదిరాడుగా..!

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఆయ‌న త‌న‌యుడు సీనియ‌ర్ హీరో బాల‌కృష్ట ఎన్టీఆర్ పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాను ఆయ‌నే స్వ‌యంగా ఎన్టీఆర్ పాత్ర‌ను పోషిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.నేడు నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలోని లుక్‌ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్ర‌ను ఆయ‌న మ‌న‌వుడు సుమంత్ న‌టిస్తున్నారు.

సుమంత్ లుక్‌ని చూస్తుంటే అక్కినేని నాగేశ్వరరావుని చూసిన‌ట్లుగానే ఉంది. ఎన్టీఆర్‌ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్‌ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కనిపించనున్నారు.సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -