సుందరం మాస్టర్‌కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. డ్యాన్స్ మాస్టర్‌గా ,ప్రభుదేవా తండ్రిగా ఎనలేని కీర్తి సంపాదించారు సుందరం మాస్టర్.తాజాగా ఆయన కమెడియన్ ఆలీ నిర్వహించే ఓ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తన జీవిత విశేషలతోపాటు ,తన సినిమా కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చారు.డ్యాన్స్ మాస్టర్ అవడానికి కన్నా ముందు నటనపై ఆసక్తిగా ఉండేవారట సుందరం మాస్టర్.”తమిళంలో ఎంజీఆర్ .. వైజయంతిమాలా జంటగా చేసే ఒక సినిమాలోనాకు చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది.
ఎలా చేస్తానోనని నన్ను టెస్ట్ చేశారు .. సూపర్ గా చేశాను.కానీ క్లాప్ కొట్టగానే నా నోట్లో నుంచి మాట రావడం లేదు. క్లాప్ కొట్టకపోతే డైలాగ్ బాగా చెప్పేవాడిని. క్లాప్ కొడితే నాలో ఏదో భయం ప్రవేశించేదని చెప్పారు.ఆ ఒక్క డైలాగ్‌కు ఏకంగా 13 టేకులు తీసుకున్నాను.నేను కనుక ఆ రోజు ఆ డైలాగ్ చెప్పి ఉంటే ఈ రోజున ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీలో ఉండేవాడు కాదని ఆయన చెప్పుకొచ్చారు.