Wednesday, May 7, 2025
- Advertisement -

ఉదయ్ కిరణ్ చాలా కష్టపడి పైకి వచ్చాడు : సునీల్

- Advertisement -

టాలీవుడ్ లో వరస హిట్స్ అందుకున్న హీరోగా పేరు సంపాధించుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. అయితే అతను చేసింది కొన్ని సినిమాలే. కానీ అతన్ని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అతి చిన్న వయసులోనే స్టార్ గా ఎదిగాడు. కానీ అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ కు గురయ్యాడు. కెరీర్ లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఉదయ్ కిరణ్ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడంతో పాటు ఆయన చివరకు ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది.

ఉదయ కిరణ్ మృతి చెందిన తర్వాత కూడా ఆయనతో వర్క్ చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ నటీనటులు ఆయన్ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఆయన పడ్డ కష్టం గురించి.. ఆయన షూటింగ్ లో చేసిన సాహసాల గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఈసారి ఉదయ్ కిరణ్ జ్ఞాపకాల్లో సునీల్ నిలిచాడు. ఉదయ్ కిరణ్ తో సునీల్ చాలా సినిమాలే చేశాడు. వీరిద్దరి కాంబోలో మంచి కామెడీ సీన్స్ పండాయి. ఇప్పటికి అవి యూట్యూబ్ లో కనిపిస్తూనే ఉంటాయి. సునీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ సినిమా కోసం పడిన కష్టం ఏంటో చెప్పాడు.

నువ్వు నేను మూవీ షూటింగ్ టైంలో డైరెక్టర్ తేజ రన్నింగ్ సీన్ ను షూట్ ప్లాన్ చేశారు. అందుకోసం ప్రొఫెషనల్ రన్నర్స్ ను పిలిపించాడు. వారితో రన్ చేసి ఉదయ కిరణ్ గెలవాల్సి ఉంటుంది. సీన్ ప్రారంభించిన తర్వాత ఉదయ్ కిరణ్ నిజంగానే ప్రొఫెషనల్ రన్నర్స్ ను బీట్ చేసి మరి పరిగెత్తాడు. అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తావని అడిగితే అప్పట్లో బస్సుల వెనుక పరిగెత్తే వాడిని.. అదే అనుభవంతో ఇక్కడ పరిగెత్తానంటూ కామెడీ చేశాడు. ఉదయ్ కిరణ్ చాలా జోవియల్ గా ఉండేవాడు. షూటింగ్ సెట్ లో అందరితో కలివిడిగా ఉంటూ పలకరించేవాడని సునీల్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -