ఎలాంటి అండదండలు లేకుండా పరిశ్రమలోకి వచ్చి.. వరస హిట్స్ అందుకున్న ఏకైక తెలుగు హీరో.. ఉదయ్ కిరణ్. పుట్టేటప్పుడు నలుగురు మనుష్యులు ఉన్నరాలేరా అనేది మనకు సంబంధం ఉండదు కాని చచ్చేటప్పుడు మాత్రం నలుగురు మనుష్యులను సంపాదించుకోలేకపోవడం అది ఖచ్చితంగా మనతప్పే అంటున్నాడు ఓ మహా సిని కవి.
కానీ ఇది హీరో ఉదయ్ కిరణ్ విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయ్యింది. ఆయ మరణించాక.. అతని దేహం తీసుకుపోవడానికి ఒక్కరు కూడా ముందుకురాని పరిస్థితి ఎందుకు ఎదురైంది. దానికి కారణం రాజకీయమా? లేక అర్దికమా? నశించిపోతున్న మానవ సంబంధాలా..? అప్పట్లో ఈ హీరో మరణం వెనుక మెగా ఫ్యామిలీపై అనేక ఆరోపణలు వ్యక్తం కాగా, తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ ను తలచుకున్నారు దర్శకుడు తేజ.
‘అహింస’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తేజ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘దాని గురించి మాట్లాడతాను…. అయితే, కొందరు ‘మీరే చెప్పండి’ అంటూ అమాయకంగా యాక్ట్ చేస్తుంటారు’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. డెత్ మిస్టరీ గురించి తెలిసినా కొందరు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారన్న తేజ. సూపర్ హిట్ ‘చిత్రం’ సినిమాతో వెండితెరకు ఉదయ్ కిరణ్ ను పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి.
కెరీర్ లో ఎదుగుతూ ఒక హీరోగా స్థిరపడిపోయిన సమయంలో చిరంజీవి తనయురాలితో జరిగిన నిశ్చితార్ధ వేడుకే ఉదయ్ కిరణ్ జీవితాన్ని మలుపు తిప్పింది అన్నది బహిరంగ సత్యమే. అయితే ఆ తర్వాత తెర వెనుక ఏం జరిగిందో పైనున్న వాడికే తెలియాలి. పెళ్లి కాన్సిల్ కావడం, మరో వైపు ఉదయ్ కిరణ్ కు సినీ అవకాశాలు దూరం కావడం ఒకేసారి జరుగుతూ వచ్చి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి. చివరికి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు.
