Monday, May 5, 2025
- Advertisement -

స‌న్నీలియోన్ న‌గ్న సందేశం

- Advertisement -

స‌న్నీలియోన్ ఏం చేసిన సంచ‌ల‌న‌మే.పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగేసింది గనుక.. ఆమె విషయంలో ఎక్స్‌పోజింగ్‌, సెక్సప్పీల్‌, టాప్‌లెస్‌ సెమీ న్యూడ్‌, న్యూడ్‌.. వంటి మాటలు చాలా చాలా చిన్నవిగా అన్పిస్తాయి. సన్నీలియోన్‌ హాట్‌నెస్‌కి ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై క్రేజ్‌ మాత్రం ఓ రేంజ్‌లో వుందన్నది నిర్వివాదాంశం. తెలుగులో రెండు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసినా, బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేస్తున్నా సన్నీలియోన్‌ లెక్కే వేరు.

ఇక, అసలు విషయానికొస్తే.. సన్నీలియోన్‌ ఈసారి నగ్నత్వం ప్రదర్శించింది ఓ మంచి పని కోసమే. అదేంటో తెలుసా.? ‘పెటా’ తరఫున ప్రచారం కోసం. మొసళ్ళ చర్మాన్ని ఎలా తీస్తారు.? గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారు.? వంటి విషయాల్ని అత్యంత భయానకంగా ఓ వీడియోలో పొందుపర్చి, వాటితో తయారుచేసేవాటిని మనం ధరించాలనుకోవడం మంచిది కాదంటూ క్లాస్‌ తీసుకుంది ‘పెటా’. ఆ ‘పెటా’ తరఫున సన్నీలియోన్‌, ఆమె భర్త ప్రచారానికి దిగారు. అద్గదీ పైనున్న ఫొటో వెనుక అసలు కథ.

ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆ పేరు చెప్పి.. నగ్న శరీరాల్ని ప్రదర్శనకు పెట్టడంపై అందాల భామలు చాలాకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్‌లో ఇంతకు ముందు చాలామంది అందాల భామలు ఇలాంటివి చేసేశారు.. వివాదాల్లోకి కూడా ఎక్కారు. మరి, సన్నీలియోన్‌ కూడా అంతేనా.? ఆమె ధరించే లెదర్‌ జాకెట్స్‌ సంగతేంటి.? ఈ ప్రచారమేంటి.? అంటే.. దాని దారి దానిదే.. దీని దారి దీనిదే.!

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -