Friday, May 3, 2024
- Advertisement -

నాగార్జున దర్శకుడి తో అభిరాం దగ్గుబాటి డెబ్యూ?

- Advertisement -

రానా దగ్గుబాటి ని లీడర్ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం చేసిన సురేష్ బాబు, తన చిన్న కుమారుడు అభిరాం విషయం లో నూ ఏదో ఒకటి చేయాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మొదట అతడు నిర్మాణం లో స్థిరపడతారు అనుకుంటే అక్కడ సరిగా ఉండటం లేదని, ఆ తర్వాత హీరో గా పరిచయం చేద్దాం అనుకుంటే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్న తరుణం లో నే శ్రీ రెడ్డి భాగోతం జరగడం, ఆ తర్వాత అభిరాం కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఉండటం జరిగింది.

ఇటీవల ఓ బేబీ సినిమా కి సంబంధించి ప్రమోషన్స్ సందర్భం గా అభిరాం మీడియా ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి మళ్ళీ అభిరాం సినిమా ప్రవేశం గురించిన చర్చ ఊపందుకుంది. అయితే అభిరాం ని హీరో గా నే పరిచయం చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే రాహుల్ రవీంద్రన్ ని ఆ సినిమా కి దర్శకుడి గా పెట్టాలని అనుకుంటున్నారట.

రాహుల్ ఇప్పటికే అక్కినేని కుటుంబం లో రెండు సినిమాలు చేసాడు. సుశాంత్ కి మంచి హిట్ ఇచ్చి ఇప్పుడు నాగార్జున కి కూడా హిట్ ఇవ్వనున్న తరుణం లో సురేష్ ఎలాగైనా రాహుల్ ని ఒప్పించి ఈ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=E2NpkMohTRk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -