బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాడినికి ఏం లేదు. గతంలో బాలీవుడ్‌ను ఓ ఊపును ఊపింది సుష్మితా సేన్. అయితే తన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తన సినిమా కెరీర్‌లో కూడా సుష్మిత ఎవ్వరితోను లవ్‌లో కాని ఎఫైర్ కాని నడిపినట్లు వార్తలు రాలేదు. అయితే లేటు వయస్సులో అమ్మడికి తోడు కావాలని అనిపించింది అనుకుంటా. దీంతో ఓ యంగ్ కుర్రాడితో డేటింగ్ చేస్తుంది సుష్మిత.
ముంబైకి చెందిన రోహ్మాన్ షాల్ అనే మోడల్‌తో సుష్మితా ప్రేమలో ఉంది. గత కొద్ది కాలంగా ఈ జంట బయట చక్కర్లు కొడుతు కనిపిస్తున్నారు. సుష్మిత కూడా రోహ్మాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుష్మిత, రోహ్మాన్ లు ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిలో సుష్మితా చేతికి ఉన్న ఉంగరం హైలైట్ అయ్యేలా ఫోటో తీశారు.
ఈ ఫోటో చూసిన చాలామంది సుష్మితా, రోహ్మాన్ లకు ఎంగేజ్మెంట్ అయిందంటూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు. మరికొందరు అయితే రోహ్మాన్ సుష్మితా కంటే వయసులో చాలా చిన్నవాడు. కానీ వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. మరి ఈ బంధం పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి.
- Advertisement -
కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ హీరోయిన్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -