Friday, March 29, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరో పై విరుచుకుపడ్డ తాప్సీ

- Advertisement -

తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయి ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తాప్సి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. గతంలో ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరొక సారి అలాంటి కామెంట్లతో ముందుకు వచ్చింది తాప్సి. ఈ సారి ఒక్క తెలుగు హీరో పై విరుచుకు పడింది. ఈ మధ్యనే ఆమె ఒక కథ నచ్చడంతో సినిమాకి సైన్ చేసిందట. ఆ తర్వాత నిర్మాతలు ఆమె వద్దకు వచ్చి సినిమా హీరో పైన ఆధారపడుతుందని హీరో కి మార్కెట్ అంతగా లేదు కాబట్టి తన రెమ్యూనరేషన్ తగ్గించుకోమని కోరారట.

హీరోకి మార్కెట్ లేకపోతే తన రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి అంటూ ఆమె ప్రశ్నించింది. అందుకే అప్పటి నుంచి హీరో లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది తాప్సీ. అది తెలుగు హీరోనే అని చెప్పింది కానీ హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు. అప్పటి నుంచి తన చుట్టూ తిరిగే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారని తాప్సీ చెప్పింది. ఇక సినిమాల పరంగా ఈమె నటించిన ‘గేమ్ ఓవర్’ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -