Monday, April 29, 2024
- Advertisement -

తెలుగు లో తాప్సి, తమిళం లో తమన్నా

- Advertisement -

తెలుగు లో తాప్సి మొదటగా ఝుమ్మంది నాదం అనే సినిమా లో కనిపించింది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కి రాఘవేంద్ర రావు దర్శకుడు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా తాప్సి కి మాత్రం గ్లామర్ డాల్ అనే టాగ్ తో పాటు అవకాశాలు చాలా నే వచ్చాయి. అయితే వాటిల్లో తాప్సి మెరిసిన పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయింది. చివరికి బాలీవుడ్ లో పింక్ సినిమా తో అతి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తాప్సి పెద్దగా వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కాకపోతే చాల కాలం తర్వాత తెలుగు లో ఆనందో బ్రహ్మ అనే సినిమా చేసింది తాప్సి. ఈ సినిమా విజయం సాధించినా తాప్సి వెంటనే మరో రెండు హిందీ సినిమాలు ఒప్పుకుంది.

అయితే ఈ సినిమా విజయం సాధించినప్పుడే తమిళం లో కూడా రీమేక్ చేయాలి అనుకున్నారు. అప్పుడు తాప్సి నే పెట్టి తమిళం లో సినిమా చేయాలి అనుకున్నారు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ తమిళం లో మెటీరియలైజ్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం తాప్సి బిజీ గా ఉండటం తో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తమన్నా చేతికి వెళ్ళింది. ఖామోష్, అభినేత్రి తో ఫామ్ లో ఉన్న తమన్నా ఇప్పుడు తమిళ ప్రేక్షకులకి ఆనందో బ్రహ్మ రుచి చూపించనుంది! తాప్సి మెరిసిన పాత్ర లో తమన్నా ఏ మేరకు మెరుస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -