Friday, March 29, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ స్టార్ హీరో….

- Advertisement -

తమిళంతోపాటు తెలుగులోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. సూర్య న‌టించిన సినిమాల‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తాజా చిత్రం ఎన్‌జీకే (నంద గోపాలకృష్ణ) ప్రిరిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు జ‌గ‌న్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ హీరో సూర్య‌కు మంచి స్నేహితుడ‌న్న సంగ‌తి తెలిసిందే. జగన్ తో స్నేహంగా ఉండే సూర్య.. ఇప్పుడు తన స్నేహితుడు ముఖ్యమంత్రి కాబోతుండటంపై స్పందించాడు. ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ పదేళ్ల కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సూర్య. అలుపెరగకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. ఘన విజయం సాధించారు. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రజల్లో జగన్ పట్ల ఎంత అభిమానం ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శన‌మ‌న్నారు.

జగన్ అన్న కజిన్ అనిల్ రెడ్డి తనకు క్లాస్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన సూర్య. అనిల్ ద్వారానె జగన్ అన్న కుటుంబానికి కూడా తాను దగ్గరయ్యానని తెలిపారు. జగన్ అన్న ఎన్నికల్లో గెలిచారనే వార్త తెలియగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన దేశంలో రెండో పిన్న వయస్కుడైన సీఎం అని సుప‌రిపాల‌న అందిస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

దర్శకుడు మహి వి రాఘవ్ గతంలో రూపొందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు కొనసాగింపుగా ‘యాత్ర 2’ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం మొత్తం వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ఉంటుందట. కాంగ్రెస్ నుండి జగన్ బయటకు రావడం, కోర్టు కేసులు, జైలు శిక్ష, యాత్ర, ముఖ్యమంత్రి పదవి సాధించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయట. జ‌గ‌న్ పాత్ర‌కు హీరో సూర్య ఒప్పుకున్న‌ట్లు వార్తలొచ్చాయి.

సూర్య మాత్రం తాను జగన్ పాత్రను చేయడంలేదని అన్నారు. కొత్త చిత్రం ‘ఎన్జీకే’ ప్రమోషనల్ కోసం హైదరాబాద్ వచ్చాన‌న్నారు. ఈ సినిమా స్క్రిప్టు తన వద్దకు వస్తే ఆలోచిస్తానంటున్నాడు సూర్య. ఇప్పుడు కాక‌పోయినా భ‌విష్య‌త్తులో ఖ‌శ్చితంగా యాత్ర 2లో జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య‌న‌టించ‌డం గ్యారెంటీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -