Tuesday, May 14, 2024
- Advertisement -

తమిళంలో హిట్.. తెలుగులో ఫట్..

- Advertisement -

తమిళంలో ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్ర పోషించిన ‘కనా’ సినిమాలో శివ కార్తికేయన్ మరియు సత్యరాజ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది. తాజాగా ఆ సినిమాని తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో తో ఐశ్వర్య రాజేష్ మరియు శివ కార్తికేయన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్నప్పటికీ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి విజయాన్ని సాధించలేకపోయింది. వారాంతం లో కూడా అ సినిమా కలెక్షన్లు ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం.

ఇక సోమవారం నాటికి 15 శాతం కలెక్షన్లు తగ్గిపోయింది. మల్టీప్లెక్స్ లలో కేవలం 20% శాతం ఆక్యుపెన్సీ ఉండగా సింగిల్ స్క్రీన్లలో 17 శాతం నమోదైంది. వారాంతం లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల లోనూ ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా కేవలం 30 నుంచి 50 శాతం వరకు మాత్రమే ఆక్యుపెన్సీ అని నమోదు చేసుకోగలిగింది. సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం కూడా సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో ఒకటి అని అభిమానులు సైతం చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసిన కొన్ని ఎపిసోడ్స్ బాగా లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా భీమనేని శ్రీనివాసరావు బోలెడు రీమేక్ సినిమాలు తీశారు కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -