#మీటూ ఉద్యమం కాస్తా చల్లారింది అనుకుంటే మళ్లీ ఎవరో ఒకరు దీనిపై మాట్లాడుతు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.తాజాగా మరో నటి హీరోపై లైంగిక ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.తమిళ హీరోయిన్ నిక్కీ గల్రాని రంగం ఫేం హీరో జీవాపై లైంగిక ఆరోపణలు చేసింది.జీవాపై మీటూ ఆరోపణలు చేస్తున్న కారణంగా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావడం లేదని తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది నిక్కీ గల్రాని. జీవాకి క్షమాపణలు చెప్పినా.. తనకు సినిమాల్లో వస్తోన్న అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్ లో నిక్కీ గల్రాని పేరుతో ఓ పోస్ట్ ఉంది.
అయితే ఈ పోస్ట్ చేసింది తాను కాదని చెబుతుంది నిక్కీ గల్రాని.ఈ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో ఇది తను పెట్టిన పోస్ట్ కాదని క్లారిటీ ఇచ్చింది. ”ఈ విషయం నా చేయి దాటిపోతోందని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. నా పేరుతో ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.జీవా చాలామంచి వ్యక్తి ,నాకు మంచి మిత్రుడు కూడా ,అతడు నాతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది.తనపై ఎవరో కావాలని ఇలా కుట్ర చేస్తున్నారని వాపోయింది నిక్కీ గల్రాని.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’