టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేశ్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో దర్శనం ఇచ్చాడు కార్తి. దీంతో అందరు ఈ సినిమాలో కార్తి నటిస్తున్నాడని అనుకున్నారు.
పైగా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి గతంలో దర్శకత్వం వహించిన ఊపిరి సినిమాలో కార్తి నటించాడు. దీంతో ఈ సినిమాలో కార్తి కీలక పాత్రలో కనిపించబోతున్నాడని చాలామంది అనుకున్నారు. అయితే అలాంటిది ఏమి లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేశ్ , కార్తి ఇద్దరు క్లాస్‌మెట్స్. చెన్నైలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. పైగా ప్రస్తుతం కార్తి దేవ్ సినిమా ప్రమోషన్న్ కోసం హైదరాబాద్ వచ్చాడు. మహేశ్ మహర్షి షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుండటంతో షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి మరి మహేశ్‌ను కలిశాడు కార్తి. కార్తి నటించిన దేవ్ సినిమా ఈ రోజే(గురువారం) విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ నటించింది.
- Advertisement -
మహేశ్ ‘మహర్షి’లో తమిళ హీరో కార్తి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -