Sunday, May 11, 2025
- Advertisement -

చిరంజీవితో గొడ‌వ‌పై స్పందించిన త‌మ్మారెడ్డి..!

- Advertisement -

దాస‌రి త‌రువాత ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజని భావిస్తుంటారు కొంద‌రు. అలాంటి వ్య‌క్తికి చిరంజీవితో గొడ‌వ ఎందుకు ప‌డాల్సి వ‌చ్చింది అనేది చాలామందికి అనుమానం ఉంది. అసలు చిరంజీవితో గొడ‌వ జ‌రిగింద‌నే విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది కూడా తమ్మారెడ్డి భరద్వాజనే కావడం విశేషం. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా స్పందించారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని భావిస్తుంటారని తమ్మారెడ్డి చెప్పారు.

అదంతా అవాస్తవమని తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఎవరూ లేరని, ఏదైనా ప్రేమతోనే జయించగలమనేది తన నమ్మకమని చెప్పారు. అంతే కాని చిరంజీవికి నాకు ఎటువంటి అభిప్రాయ‌భేదాలు లేవ‌ని తమ్మారెడ్డి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -