Thursday, May 2, 2024
- Advertisement -

ఫోటో షూట్ మిస్ ఫెయిర్ అయిందే

- Advertisement -

టాక్సీ వాలా అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన అనంతపూర్ భామ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమా తో పెద్దగా ప్రేక్షకులను మేప్పించకపోయిన్నప్పటికి సినిమా విజయం సాధించడం తో ప్రియాంక కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే టాక్సీ వాలా విడుదల అయ్యి ఇన్ని రోజులు అయినప్పటికీ ప్రియాంక కి ఇంకా కొత్త అవకాశాలు ఏమీ రాలేదు. ఒకటి రెండు సినిమాల కోసం ప్రియాంక ని అప్రోచ్ కాగా స్క్రిప్ట్ తనకి నచ్చకపోవడం తో సినిమా ని రిజెక్ట్ చేసింది అనే టాక్ ఇండస్ట్రీ లో నడుస్తుంది.

అంతే కాకుండా సరికొత్త ఫోటోషూట్ ల తో కుర్రకారు మతి పోగొట్టే లాగా ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే పనిలో కూడా ప్రియాంక ఉంది. అయితే తాజా ఫిలిమ్ నగర్ సమాచారం మేరకు ఇటీవలే తను చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోల మీద వచ్చిన వార్తలు ప్రియాంక కు నచ్చలేదు అట.

ఇటీవలే ప్రియాంక కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో లలో స్ట్రాప్ లెస్ బ్రా వేసుకొని ప్రియాంక తన క్లీవేజ్ ని ఎక్స్పోజ్ చేస్తూ పోజ్ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రియాంక టాప్ లెస్ గా ఫోటోలు దిగింది అనే శీర్షికలతో ప్రచురించారు అట. వీటి గురించి తెలుసుకున్న ప్రియాంక చాలా బాధ పడింది అట. నిజానికి తాను అలా చేయలేదు అని, అనవసరం గా ఇటువంటి వాటి వల్ల నెగటివిటి పెరుగుతుంది అని ప్రియాంక తన సన్నిహిత వర్గాల దగ్గర బాధ పడిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -