భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం సర్వస్వం కోల్పోయిన సంగతి తెలిసింది.20 రోజులు కురిసిన భారీ వర్షాలకు కేరళలోని 42 నదులు ఒకేసారి పొంగి పొర్లాయి.దీంతో కేరళలోని 4 జిల్లాలు పూర్తి దెబ్బతిన్నాయి. దాదాపు రెండు లక్షల మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వ ఏర్పాటు చేసిన గృహాలలో తల దాచుకున్నారు.కేరళ యథాస్థితికి రావడానికి మరో 10 ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు నుంచి కేరళకు ఆర్థిక సాయం అందుతున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటీకే తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ,కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కేరళకు విరాళాలు ప్రకటించారు.
తాజాగా తెలుగు రియాల్టీ షో అయిన బిగ్‌బాస్ టీం కేరళ రాష్ట్రానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. తెలుగు బిగ్‌బాస్ నుంచి కేరళకు దాదాపు 12 కోట్లు సాయం చేసినట్లు తెలుస్తుంది.ఈ మొత్తన్ని కేరళ సీఎంకు స్వయంగా బిగ్‌బాస్ హెడ్ వెళ్లి ఇచ్చారని సమాచారం.అలాగే బిగ్‌బాస్ హౌస్‌మెట్ అయిన సామ్రాట్ తను ర్యాంప్ వాక్‌లో గెలిచిన లక్ష రూపాయిలను కూడా కేరళ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు సామ్రాట్ ఇంటి సభ్యులు తెలిపారు.బిగ్‌బాస్ హౌస్‌మెట్స్ అందరు కేరళ తొందరగా కోలుకొవాలని కోరారు.