స్పైడర్‌తో తన ఇమేజ్‌కి చాలానే డ్యామేజ్ చేసుకున్నాడు మహేష్. అయితే ఆ వెంటనే వరుసగా కొరటాల శివ, వంశీ పైడిపల్లిలాంటి ప్రామిసింగ్ డైరెక్టర్స్ సినిమాలు ఉండడంతో మరీ ఎక్కువ నష్టం జరగలేదు. మరీ ముఖ్యంగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న కొరటాల శివ సినిమా మహేష్ మార్కెట్ డౌన్ అవ్వకుండా చేసింది. భరత్ అను నేను సినిమా బిజినెస్ అయితే ఓ రేంజ్‌లో జరుగుతోంది. మరి సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందా? తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఏం అర్థమవుతోంది?
భరత్ అను నేను సినిమా ట్రైలర్‌లో కంటెంట్ చాలా బాగుంది. కొరటాల స్కిల్స్ బాగా కనిపిస్తున్నాయి. డైలాగ్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. మొత్తంగా చూస్తే విషయం ఉన్న సినిమా అనిపిస్తోంది. అయితే భరత్ రామ్ అనే క్యారెక్టర్‌కి మహేష్ బాబు పూర్తిగా న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే మహేష్ బాబు యాక్టింగ్ ఇతర హీరోల కంటే బెటర్ అన్నట్టు ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం రొటీన్ అనిపిస్తున్నాడు. తాజాగా రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు. ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నాడు. అలాంటి నేపథ్యంలో మహేష్ బాబు కూడా చాలా మారాలి. స్పైడర్‌లో ఉన్న మహేష్ బాబుకు భరత్ అను నేను ట్రైలర్‌లో కనిపించిన మహేష్ బాబుకు అస్సలు తేడాలేదు. డైలాగ్ డెలివరీ, కాస్ట్యూమ్స్, లుక్…..ఇలా అన్ని విషయాల్లోనూ పాతగానే కనిపిస్తున్నాడు. ఇక మహేష్ యాక్టింగ్ కూడా ఈ సినిమా స్టాండర్డ్స్ స్థాయిలో లేదు. ఇదే ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అయ్యే అవకాశం ఉందని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్‌లో అయితే ఈ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలో కూడా మహేష్ ఫెయిల్ అయ్యి ఉంటే మాత్రం ఇక భరత్ అను నేను భారం మొత్తం కొరటాల శివనే మొయ్యాలి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ మరీ ఛార్ట్ బస్టర్స్ అయ్యే రేంజ్‌లో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగానే ఉంది. మొత్తంగా చూస్తే భరత్ అను నేను సినిమా రిజల్ట్ మొత్తం కూడా ఇప్పుడు కొరటాల శివ కథనం, డైలాగ్స్‌పైనే ఆధారపడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. కథ కూడా ఓ స్థాయిలో మెప్పించాల్సిందే. ట్రైలర్‌లో అయితే కొరటాల శివ రైటింగ్, క్రియేటివ్ వర్క్ బాగుంది.
తర్వాత రాబోయే సినిమాల విషయంలో అయినా మహేష్ బాబు తన యాక్టింగ్ స్కిల్స్, లుక్స్, డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. లేకపోతే ప్రేక్షకులకు మొనాటనీ వచ్చేయడం అయితే ఖాయం అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
The Journey of Bharat – #BharatAneNenuTrailer https://t.co/GB6RnVUpwA
— DVV Entertainment (@DVVMovies) April 7, 2018