దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీటవుతోంది. అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిసి సూపర్‌హిట్‌గా నిలిచిన శివకు సీక్వెల్‌గా ‘ఆఫీసర్’ సినిమా రూపొందిస్తున్నారు. రోజుకో వార్త వర్మ, నాగార్జున విడుదల చేస్తూ సినిమాను ఇప్పటి నుంచే ప్రచారం ఇచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలో సినిమాలో నటిస్తున్న కొత్త హీరోయిన్ లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్లను సరికొత్తగా చూపిస్తున్నారు. ఇండస్ట్రీ కొత్తరకం నటులను తీసుకొస్తుంటారు. అతడి సినిమాలో కొత్తవాళ్లు అధికంగా ఉంటారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని వర్మ పాటిస్తూ ఆఫీసర్ సినిమాకు కొత్త హీరోయిన్‌ను పట్టుకొచ్చాడు. మైరా సరీన్ అనే హీరోయిన్‌ను నాగ్ పక్కన నటింపజేస్తున్నాడు.
ఇటీవల నాగ్, మైరా కలిసి ఉన్న ఫోటోలని విడుదల చేశారు. చేతిలో గన్ పట్టుకొని సీరియస్ లుక్‌లో మైరా సరీన్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కన్పిస్తున్నాడు. కంపెనీ బేనర్‌లో వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా మే 25వ తేదీన విడుదల చేయనున్నారు.