Friday, May 3, 2024
- Advertisement -

ఫినిషింగ్ టచ్ … ఆ నాలుగు సినిమాలేనా..

- Advertisement -

ఈ ఏడాది ఎండింగ్ లో వచ్చే క్రిస్‌మస్‌తో 2017 ముగుస్తుంది. 2017లో కూడా సంక్రాంతి మొదలుకొని దీపావళి వరకు అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఇక మిగిలింది రెండే నెలలు. అందుల్లో ఉన్నది ఒక్కటే క్రిస్‌మస్‌ పండుగ .ఈ టైమ్లో రిలీజయ్యే చిత్రాలపై ఒకసారి దృష్టిసారిస్తే…. ఎలాంటి పీస్ లున్నాయో తెలుస్తుంది. అందులో ముందుగా వచ్చేది… అక్టోబర్‌ 27న రామ్‌ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం విడుదలవుతుంది.

‘నేను శైలజ’ చిత్రం హిట్‌ తర్వాత రామ్, డైరెక్టర్ కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇదే. ఇక క్రిస్‌మస్‌ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 21న నాని నటిస్తున్న ‘ఎం.సి.ఎ- మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం విడుదలకు నోచుకుంది. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో నానితో ‘నేను లోకల్‌’ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. అలాగే అఖిల్‌ అక్కినేని నటించిన రెండో సినిమా ‘హలో’ సైతం డిసెంబర్‌ 22న విడుదల అవుతుంది.

‘అఖిల్‌’ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 29న గోపిచంద్‌ నటించిన ‘ఆక్సిజన్‌’ చిత్రం విడుదల కానుంది. ఇటీవల గోపిచంద్‌ నటించిన ‘గౌతమ్‌ నందా’ చిత్రం విడుదలైంది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ ఫిలింతోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇవనే కాకుండా కొన్ని చిన్న సినిమాలు, తెలుగులోకి అనువాదమైన తమిళ సినిమాలు కూడా విడుదలకు రెఢీ అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -