యాంకర్ రష్మీ జబర్థస్త్ కామెడీ షో ద్వారా బాగానే పాపులర్ అయింది. ఈ షోలో రష్మీ వేసుకునే పొట్టి పొట్టి అందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక రష్మీ కొన్ని సినిమాలలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అలాంటి భామపై ఓ వివాదం అలుముకుంది. రష్మీ ,సుధీర్‌లు కలిసి తిరుపతిలో జరగనున్న 10 కె రన్‌లో పాల్గొంటున్నారంటు అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ కార్యక్రమ నిర్వాహకులు హోర్డింగ్ పెట్టడమే కాకుండా దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిని చూసిన రష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఈవెంట్‌కు సంబంధించిన వారు ఎవరు నన్ను సంప్రదించలేదని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.దీనిపై స్పందించిన కార్యక్రమ నిర్వాహకుడు.. కార్యక్రమానికి రష్మి రావడానికి ఒప్పుకుందని.. ఇప్పుడు ఖండిస్తోందని అన్నారు. ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపానని నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నాడు షో నిర్వహకుడు. రష్మీ కనుక ఈవెంట్‌కు రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న రష్మీ ఆ నిర్వహకుడు అబద్దాలు చెబుతున్నారని ,నిజాలు త్వరలోనే బయటపడతాయి అని ఆమె తెలిపింది.మరి ఈ వ్యవహారం ఎంత దూర్ వెళ్తుందో చూడాలి.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!