పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ అలీ టాలీవుడ్‌లో వీరిద్దరు మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్ నటించే ప్రతి సినిమాలో అలీకి ఓ ప్రత్యేక పాత్ర డిజైన్ చేస్తారు దర్శకులు. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. రాజకీయం ఎంతటి వాడినైనా మిత్రుడిని శత్రువు చేస్తోంది అనే సామేత వీరిద్దరి సరిపోతుంది. పవన్ సినిమాలను వదిలేసి జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.
ఇదే సమయంలో అలీ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట అలీ పవన్ జనసేనలో చేరతాడని భవించారు. కాని అనుహ్యంగా అలీ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. దీనిపై పవన్ కాస్తా ఘాటుగానే స్పందించాడు. అలీకి నేను అన్ని విధాల సహాయం చేశాను. కాని అలీ మాత్రం నన్ను మోసం చేశాడని ఆరోపించారు. దీనిపై అలీ కూడా అదేవిధాంగా కౌంటర్ ఇచ్చాడు. తాజాగా దీనిపై నటుడు పృథ్వీ స్పందించాడు.
అలీ కష్టపడిపైకి వచ్చిన వ్యక్తి అని పవన్ కల్యాణ్ గారికి తెలియకపోవచ్చని, అందుకనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని పృథ్వీ అభిప్రాయపడ్డాడు.ఎన్టీఆర్, చిరంజీవి,మోహన్ బాబు వంటి వారు ఎలాగో కష్టపడిపైకి వచ్చారో , అలీ కూడా అదేవిధాంగా కష్టపడిపైకి వచ్చారని చెప్పుకొచ్చాడు పృథ్వీ.
- Advertisement -
అలీ గురించి పవన్‌కు సరిగ్గా తెలియకపోవచ్చు..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
