Friday, May 17, 2024
- Advertisement -

షాకింగ్ః గోనగన్నారెడ్డి సూత్రధారి…. బన్నీ సన్నిహితుడు అయిన డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడేలాంటి పరిణామం మరోసారి చోటు చేసుకుంది. బన్నీకి అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది. గోనగన్నారెడ్డి రూపకర్త, అలాగే సరైనోడు సినిమాలో కామెడీ ట్రాక్స్ రచించిన రైటర్…..ఒక్క అమ్మాయి తప్ప సినిమా డైరెక్టర్ రాజసింహ తాడినాడ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు మెగా వర్గాలతో పాటు ఇండస్ట్రీ జనాలను షాక్‌కి గురిచేసింది.

బన్నీ కెరీర్‌లోనే రుద్రమదేవిలో నటించిన గోన గన్నారెడ్డి పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఆ పాత్రను అంత బాగా రూపొందించినది….ఆ పాత్రకు అద్భుతమైన డైలాగులు రాసింది…….తెలంగాణా యాసలో ఉండే ఆ డైలాగులను అంతే అద్భుతంగా బన్నీ చేత పలికించినది రాజసింహా తాడినాడనే. ఆ తర్వాత కూడా బన్నీ కోసం సరైనోడు సినిమా కోసం కామెడీ ట్రాక్ రాసి ఇచ్చాడు. ఇక ఆ మధ్య సందీప్ కిషన్‌తో ఒక్క అమ్మాయి తప్ప సినిమాను రాజసింహా డైరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా బన్నీ పర్సనల్‌గా సెట్స్‌కి రాజసింహాను చాలా ప్రోత్సహించాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటు ఆ తర్వాత కూడా రాజసింహాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ మించి వ్యక్తిగత జీవితంలో కూడా రాజసింహాకు సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక యంగ్ డైరెక్టర్ ఆత్మహత్యాప్రయత్నం చేయడం మాత్రం టాలీవుడ్ జనాలను విషాదంలో ముంచెత్తింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -