Saturday, May 18, 2024
- Advertisement -

నటుడు రాహుల్‌ దేవ్‌ ప్రియురాలు ఎవరంటే ?

- Advertisement -

ప్రేమలో వయసు చూసి ప్రేమించడం తగ్గిపోయింది. తమకంటే వయసులో పెద్ద అమ్మాయిలను కొందరు ప్రేమిస్తున్నారు. తమకంటే వయసులో సగం కూడా లేని అమ్మాయిలను అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటివి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ వయసును అస్సలు పట్టించుకోరు.

విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ దేవ్‌ కూడా ఇదే పని చేసాడు. తన భార్య చనిపోయిన పదేళ్ల తర్వాత ఇప్పుడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఈయన. రాహుల్ వయసు 51.. ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి వయసు 33. మోడల్‌ ముగ్దా గాడ్సేతో రాహుల్ డేటింగ్‌లో ఉన్నాడు. తమ ప్రేమను దాచుకోవడం లేదు. ఓపెన్ గా మీడియా ముందు చెప్పాడు రాహుల్. ఈ విషయం తన కుమారుడికి కూడా తెలుసని చెప్పాడు. 2009లో ఈయన భార్య క్యాన్సర్‌తో చనిపోయింది.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కెరీర్, కొడుకు విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉన్న ఈయనకు ఓ స్నేహితుడి పెళ్లిలో ముగ్దాతో పరిచయం అయింది. అయితే తమదేం టీనేజ్ కాదని.. తొలి చూపులోనే చూసి ప్రేమించుకోడానికి అని చెప్పాడు ఈయన. కొన్నాళ్లపాటు స్నేహం తర్వాత తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని.. అది ప్రేమగా మారిందని చెబుతున్నాడు రాహుల్.

సంతోషంగా ఉన్నపుడు వయసు తేడా ఉండదని చెప్పుకొచ్చాడు ఈయన. ఇదిలా ఉంటే రాహుల్‌ తన చిన్ననాటి స్నేహితురాలు రైనాను 1998లో చేసుకున్నాడు. వీరికి కుమారుడు సిద్ధార్థ్‌ కూడా ఉన్నాడు. అయితే ఆ కుర్రాడికి 11 ఏళ్ల వయసున్నపుడు రైనాకు క్యాన్సర్‌ వచ్చింది.. దాంతో పోరాడుతూ ఆమె 2009లో ప్రాణాలు విడిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -