తెలుగు హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్దాలు చేసుకుంటారు.అయితే ఈ గొడవలు ఫ్యాన్స్ వరకే పరిమితం అని హీరోలు రుజువు చేస్తున్నారు.గతంలో మేము అందరం ఒక్కటే అని హీరోలు చాలా సందర్భలలో చెప్పారు కూడా.అయితే ఈ మధ్య మన హీరోలు మాటలతో కాకుండా చేతలతో కూడా చూపిస్తున్నారు.మహేశ్ బాబు భరత్ అను నేను ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు ఎన్టీఆర్.ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతు మేం బాగానే ఉంటాం మీరే బాగుపడాలి అని ప్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
అప్పుడు రామ్ చరణ్,ఎన్ఠీఆర్,మహేశ్ దిగిన ఫోటోలు బాగా వైరల్ మారాయి.దీంతో ఫ్యాన్స్ మధ్య కాస్తా గొడవలు తగ్గాయి.మళ్లీ ఇన్నాళ్లుకు హీరోలు కలిశారు.ఈ సారి దర్శకుడు పుట్టిన రోజు సందర్భంగా వీరిందరు కలిశారు.దర్శకుడు వంశీపైడిపల్లి పుట్టిన రోజు నిన్న(శుక్రవారం) కావడంతో మహేశ్,రామ్ చరణ్,ఎన్టీఆర్‌లు కలిసి వంశీపైడిపల్లి ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.