Saturday, May 25, 2024
- Advertisement -

గే పాత్రలో నాగ‌శౌర్య‌…

- Advertisement -

హీరో నాగ‌శౌర్య విభిన్న సినిమాలో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది.నాగ‌శౌర్య ప్ర‌స్తుతం ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఛ‌లో సినిమా హిట్ త‌రువాత నాగ‌శౌర్య నుండి వ‌స్తున్న‌సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.పైగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సినిమా కావ‌డంతో సినిమా ఎలా ఉంటుందో అని అంద‌రు అతృతుగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా త‌రువాత మ‌రో సినిమాను లైన్లో పెట్టాడు నాగ‌శౌర్య‌. నర్తనశాల టైటిల్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు.సినిమా షూటింగ్ కూడా మొద‌లు పెట్టారు.నర్తనశాల అనగానే జనాలకు గుర్తుకు వచ్చేది బృహన్నల పాత్ర. అంటే గే క్యారెక్టర్.ఇలాంటి క్యారెక్టర్లను మన తెలుగు సినిమాల్లో కామెడీ నటులే పోషిస్తారు.తెలుగులో తొలిసారి హీరో నాగశౌర్య ఈ తరహా క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ చాలా చిత్రంగా వుంటుందని తెలుస్తోంది. హీరో గే అని చూసే ఆడియన్స్ కు తెలుస్తూ వుంటుంది కానీ రివీల్ కాదట.

కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు.మొద‌ట ఈ క‌థ‌ను ఇద్ద‌రు హీరోల‌కు వినిపిస్తే గే క్యారెక్ట‌ర్ అనే స‌రికి ధైర్యం చేయ‌లేక‌పోయార‌ని క‌థ బాగుందని, నాగశౌర్య ధైర్యంగా చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మ‌రి నర్తనశాలలో నిజంగా నాగ‌శౌర్య గే క్యారెక్ట‌ర్ చేస్తున్నాడో లేదో తెలియాలి అంటే అఫిషీయ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే వ‌రకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -