Saturday, May 11, 2024
- Advertisement -

ఆ హీరోతో నటించే అవకాశం రాలేదని త్రిష బాధపడుతోంది!

- Advertisement -

తన కు సన్నిహితులైనా..హీరోల గురించి తన వ్యూస్ ను వివరించింది త్రిష. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకొన్న ఈ హీరోయిన్ ఇప్పటి వరకూ వివిధ హీరోలతో తనకున్న అనుభవాలను పంచుకొంది.

వారికి కితాబులిస్తూ తన అభిమానాన్ని చాటుకొంది ఈ భామ. మరి ఒక హీరోయిన్ హీరోల గురించి తన అభిప్రాయాలను చెప్పడం అంటే అది ఆసక్తికరమైన అంశమే కదా.

అందులోనూ త్రిష హీరో ఆర్య గురించి చేసిన కామెంట్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఆర్య తనకు డార్లింగ్ అని త్రిష వ్యాఖ్యానించింది. ఎలా జీవించాలనేది ఆర్య నుంచి చూసి నేర్చుకోచవ్చని కూడా త్రిష చెప్పుకొచ్చింది. ఈ విధంగా అతడిని ఒక రోల్ మోడల్ గా చేసింది త్రిష. ఇక శింబు గురించి త్రిష స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది.

శింబులో నటించడానికి మీరు సమ్మతించలేదంటే కదా.. అంటే, అలాంటిదేమీ లేదని డేట్స్ అడ్జస్ట్ కాక మాత్రమే తను శింబుతో సినిమాను వదులుకొన్నానని త్రిష చెప్పుకొచ్చింది. ఇక రజనీకాంత్ తో నటించే అవకాశం రాకపోవడం పై తను అసంతృప్తితో ఉన్నానని ఆమె చెప్పింది. జీవితాంతం నటిగా కొనసాగాలనుకోరుకొంటున్నట్టుగా త్రిష వివరించింది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -