సాధారణంగా ఓ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే ఆ సినిమా హీరో గురించి ఓ రేంజ్‌లో మాట్లాడతారు . మన భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బ బాగా కొడతారు. నిన్న జరిగిన రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఇదే జరిగింది. ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టేజీపైన ఎప్పుడు లేని విధాంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు పొదుపుగా మాట్లాడే త్రివిక్రమ్ ఈ వేడుకలో రామ్ చరణ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. రామ్ చరణ్ అందరిలా కాదని ..సింహం 12 రోజులుకు ఒక్కసారి మాత్రమే వేటాడుతుందని,మిగిలిన జంతువులు అలా కాదు , రోజు వేటకు వెళ్లాల్సిందే అని చెప్పుకొచ్చాడు.
ఇక్కడ త్రివిక్రమ్ దృష్టిలో రామ్ చరణ్ సింహం, మిగిలిన హీరోలు వేరే జంతువులు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇంకా త్రివిక్రమ్ రామ్ చరణ్‌ను గురించి చెబుతు సింహం ఎలా ఆకలితో ఉంటుందో ,చరణ్ కూడా హిట్ కోసం ఆకలితో ఉన్న సింహలా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి మాటలను ఎవరు ఊహించలేదు.పైగా మహేశ్.పవన్,బన్ని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఓ హీరో గురించి మాట్లాడుతు వేరే హీరోలను కించపరచడం దారుణం అంటున్నారు వారి ఫ్యాన్స్. మరి ఈ విషయంలో త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!