Monday, April 29, 2024
- Advertisement -

నేటి అ ఆ.. నాటి మీనాకి డూప్లికేట్

- Advertisement -

అ ఆ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నితిన్, సమంతా హీరో, హీరోయిన్లు. సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఫరవాలేదనిపించింది. అయితే సినిమా చూసి వాళ్లకి ఈ సినిమా ఇంతకు ముందెప్పుడో చూసినట్లుగా లీలగా గుర్తుకొచ్చింది. అదే క్రష్ణ, విజయనిర్మల కాంబినేషన్ 1970 ల్లో సంచలన విజయం సాధించిన మీనా చిత్రం.

ఈ చిత్రం అంతకు ముందు యద్దనపూడి సులోచనారాణి నవలగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాని రీమేక్ చేసిన త్రివిక్రమ్ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. తీరా అ ఆ విడుదలవడం.. చూసివ వారంతా ఇది కాపీ అని అనడంతో ఇక తప్పనిసరిగా దీని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది త్రివిక్రమ్ కి.

అ ఆ సినిమా విజయోత్సవ వేడుకల్లో మాట్లాడిన త్రివిక్రమ్ ఈ సినిమా యద్దనపూడి సులోచనా రాణి ఆలోచన అని ప్రకటించారు. అయితే ఈ సినిమా మీనా సినిమాకి కాపీ చెప్పే ధైర్యం లేక ఆ సినిమా రచయిత్రి యద్దనపూడి ఆలోచన అంటూ నర్మగర్భంగా తన చౌర్యాన్ని ప్రపంచానికి తెలియచేశారు. స్టార్ దర్శకుడు, కాసింత పుస్తక జ్ఞానం ఉన్నవాడు అయిన త్రివిక్రమే ఇలా చేస్తే ఇక మామూలు దర్శకుల మాట ఏమిటీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -