Saturday, May 18, 2024
- Advertisement -

త్రివిక్రమ్ ఫుల్ హ్యాపీ

- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ సినిమా గురించి, ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు. తాను అనుకున్న విధంగా ఈ సినిమా అవుట్ పుట్ రావడంతో, త్రివిక్రమ్ చాలా ఆనందంగా ఉన్నాడని చెబుతున్నారు.

సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి .. వాళ్లను మెప్పించేలా చూసుకుంటాడు. ఈ సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని అనుసరించాడు. ఈ విషయంలో ఈ సినిమా తాను ఆశించినట్టుగా రావడంతో ఆయన కాస్త రిలాక్స్ అయ్యాడని అంటున్నారు. కథ .. కథనాలతో పాటు, త్రివిక్రమ్ మాటలు .. మిక్కీ జె.మేయర్ పాటలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో, నితిన్ జోడీగా సమంతా .. అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -