Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ నాని ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?

- Advertisement -

ఏందిరా బిగ్ బాస్ తమాషా చేస్తున్నావా ? నీకు నచ్చినట్టు ఎలిమినేట్ చేస్కుంటే ఇక మా ఓట్లెందుకు ? ప్రేక్షకులు అంటే పిచ్చివాళ్లులాగా కనిపిస్తున్నారా ? చెత్తనా డాష్.. అమ్ముడు పోయి, మొత్తం అన్ ఫెయిర్ గేమ్ ఆడతార్రా ? ముందే అంతా పక్కాగా ఫిక్స్ చేసుకుని, స్క్రిప్ట్ ప్రకారం డ్రామాలు ఆడుతున్నార్రా…? దొంగ నా డాష్… మాటీవీ మీద, బిగ్ బాస్ మీద బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ ఫిర్యాదు చేద్దాం. ఆ నానీగాడు ఓ వేస్ట్ ఫెలో.. వాడి దేవదాస్ సినిమాను ఎవ్వడూ చూడకండి. వీడి చేతగాని హోస్టింగ్ చూడలేక చస్తున్నాం. ఇంత బైయాస్డ్ గా యాంకరింగ్ చేసేవాడు బిగ్ బాస్ చరిత్రలో వీడొక్కడే. వీడో తోపు అనుకుంటున్నాడు. ఆ తనీష్ గాడిని, అమిత్ గాడిని, గీతామాధురిని కాపాడటానికి నానిగాడు ఎధవ డ్రామాలాడుతున్నాడు. వీడి సంగతి తేల్చుదాం. చెత్తనా కొ….

ఏంటీ ఈ తిట్లు అని ఆశ్చర్యపోకండి. ఇవి ఆద్య న్యూస్ తిట్టినవి కావు. బిగ్ బాస్ ప్రేక్షకులు ఇంతకు వంద రెట్లు తిడుతున్న తిట్లు. ఆ తిట్ల పురాణంలో నుంచి జస్ట్ ఓ శాంపిల్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. ఇంత ఆగ్రహం ఎందుకంటే ఓట్లు పరంగా రెండో స్థానంలో నిలిచిన నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసినందుకే. 12వ వారం ఎలిమినేషన్ లో కౌషల్ ఫస్ట్, నూతన్ సెకండ్, సామ్రాట్ థర్డ్, అమిత్ ఫోర్త్, గణేశ్ ఐదో స్థానంలో నిలిచారు. పలు వెబ్ సైట్స్, ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కనుక గణేశ్ తో పాటు అమిత్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహించారు. వాస్తవానికి అదే జరగాలి. కానీ బిగ్ బాస్, నానీ కలిసి ఫోర్త్ ప్లేసులో ఉన్న అమిత్ ను సేవ్ చేసి, సెకండ్ స్థానంలో నిలిచిన నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసేశారని, ప్రేక్షకులు మండిపడుతున్నారు. కౌషల్ ఆర్మీ, నూతన్ సేన, బిగ్ బాస్ ఆడియన్స్ ఈ విషయంపై తిట్టిన తిట్టు తిట్టకుండా నానీతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులను తిడుతున్నారు. ఆ ప్రోగ్రామ్ ఓ ఫేక్ గేమ్ అని, జనం ఓట్లు తీసుకుని, వారి మనోభావాలను రెచ్చగొట్టి, మోసపూరితంగా ఆడుతున్నారని బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ కు ఆన్ లైన్ ద్వారా వేల ఫిర్యాదులు చేస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేస్తున్న పలు వాణిజ్య సంస్థల ప్రొడక్ట్స్ యూజ్ చేయవద్దని సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి నూతన్ నాయుడి ఎలిమినేషన్ పెద్ద దుమారమే రేపుతోంది. రూల్స్ బ్రేక్ చేస్తూ బయటి విషయాలు ఇంటిలో చెప్పిన శ్యామలను రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ చేయాల్సింది పోయి, ఆమెను పల్లెత్తు మాట అనకుండా, ఫెయిర్ గేమ్ ఆడుతూ ఓటింగ్ లో రెండో స్థానంలో ఉన్న నూతన్ ఎలిమినేట్ చేయడంతో బిగ్ బాస్ క్రెడిబులిటీ పూర్తిగా దెబ్బతింది. ఇక నానీ హోస్టింగ్ గురుంచైతే చెప్పాల్సిన పనేలేదు. వేస్ట్….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -