Friday, April 26, 2024
- Advertisement -

న‌టి ఆత్మహత్యాయత్నం ..పరిస్థితి విష‌మం

- Advertisement -

త‌మిళ బుల్లితెర న‌టి నీలాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.గ‌త కొంత‌కాలంగా నీలాణి జీవితం తీవ్ర వివాదాల‌తో సాగుతుంది. నీలాణి ప్రేమించి, సహజీవనం చేసిన సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్‌తో గొడవ పడి వార్తల్లోకి ఎక్కెంది నీలాణీ. కొంత‌కాలం వీరిద్ద‌రు ప్రేమించి స‌హ‌జీవ‌నం చేశారు.అయితే మ‌నస్పర్ద‌లు రావ‌డంతో గాంధీలలిత్‌కుమార్‌తో విడిపోయి జీవిస్తుంది నీలాణీ.అయితే త‌న‌న పెళ్లి చేసుకోవాల‌ని వేధిస్తున్నాడ‌ని గాంధీలలిత్‌కుమార్‌పై కేకే.నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాణీ.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాంధీలలిత్‌కుమార్‌ మనస్తాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని, మీడియా ఎదుట చెప్పింది నీలాణీ.తన తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నటి నీలాణి గురువారం స్థానిక ఆలపాక్కంలోని ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం విష‌మంగానే ఉంద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -