Sunday, May 11, 2025
- Advertisement -

బిగ్‌బాస్‌లో టివి9 యాంకర్

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్ ఈ నెల(జాన్‌) 10న ప్రారంభం కాబోతుంది.షో ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే అని చాలా పేర్లు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ లిస్ట్‌లోకి మ‌రో పేరు వ‌చ్చి చేరింది.ఆమె టివి9 యాంకర్‌ దీప్తి నల్లమొత్తు.గ‌త కొంత‌కాలంగా టివి9లో యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.గత ఏడాది న్యూస్ యాంకర్‌ను తెచ్చినట్లు ఇప్పుడు మరొక యాంకర్‌ను తీసుకొవ‌ల‌ని షో నిర్వ‌హ‌కులు భావించిన‌ట్లు స‌మాచారం.దానిలో భాగంగానే దీప్తిని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది.

ఇక ఇప్ప‌టికే ఈ షో పొల్గోనే కంటెస్టెంట్స్‌లో బ‌లంగా వినిపిస్తున్న పేర్లులో తేజస్విని,సింగర్ గీతా మాధురి పేర్లు ఉన్నాయి.కంటెస్టెంట్ కి సంబంధించిన లిస్ట్ ను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నప్పటీకి ఎదో ఒక వార్తలో పేర్లు లీక్ అవుతున్నాయి.మ‌రి ఈ వార్త‌ల్లో ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షో స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -