Tuesday, April 23, 2024
- Advertisement -

జాన్ అబ్ర‌హంను తిర‌స్క‌రించిన ఇద్ద‌రు హీరోయిన్లు

- Advertisement -

బాలీవుడ్ అవ‌కాశం అంటే ద‌క్షిణాది వారు ఎగిరిగంతేసే మాట‌. ఇందులో మెరిసి అందులో క‌నిపించాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అలాంటి బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌స్తే వ‌ద్ద‌ని తిర‌స్క‌రించారంట‌. ఓ హీరో సినిమాలో న‌టించమ‌ని అడిగితే ఇద్ద‌రు హీరోయిన్లు వ‌ద్ద‌న్నారు. అత‌డు ఫ్లాపు హీరో అని చేయ‌మ‌ని చెప్పారంట‌. ఇక ఈ తిర‌స్క‌రించిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఫ్లాపు హీరోయిన్లే. వారెవ‌రో కాదు జాన్ అబ్ర‌హం, పూజాహెగ్డే, త‌మ‌న్నా.

పూజా హెగ్డే, తమన్నాల చేతిలోనే అర‌కొర అవ‌కాశాలు తెలుగు, త‌మిళ్‌లో ఉన్నాయి. తమన్నా దాదాపు ఖాళీగానే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి పరిస్థితిలో వీరిద్దరికీ బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందట! జాన్ అబ్రహం సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌మ‌ని అడిగారు. వేరేవాళ్ల‌యితే ఎగిరి గంతేసి సినిమా క‌థ విన‌కుండా ఓకే చెప్పేవారు. కానీ వీరిద్ద‌రూ సినిమాలో చేయ‌లేమ‌ని తేల్చి చెప్పార‌ట‌. హీరో కారణంగానే ఆ ఇద్దరూ సినిమాను చేయమన్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో జాన్ అబ్ర‌హం డిజాస్టర్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -