- Advertisement -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు గానూ యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును మార్చి 19న యూకే పార్లమెంటులో చిరంజీవికి అందజేయనున్నారు.
ఇటీవలె కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ అవార్డును అందించిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఇప్పటివరకు 3 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు చిరు. 2006లో పద్మభూషణ్ అవార్డు సైతం వరించింది.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నట్లు సమాచారం.