Thursday, May 2, 2024
- Advertisement -

షాక్‌లో బాలీవుడ్…యూరి.. ది సర్జికల్ స్ట్రైక్’ నటుడు కన్నుమూత

- Advertisement -

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం యూరి ది సర్జికల్ స్ట్రైక్ ఒకటి. ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వసూలు చేసిన బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. అయితే ఇందులో ముఖ్య పాత్రలో నటించిన నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూసాడు. దశాబ్దకాలంగా బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీనియర్‌ నటుడు మరణించడంతో బాలీవుడ్ అంతా షాక్ కు గురయ్యింది. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

యురి.. ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాలో నవ్‌తేజ్‌ హుందాల్‌ హోమ్ మినిస్టర్‌గా నటించారు. ఈ పాత్ర చిత్రంలో హైలెట్ అయ్యింది. నవ్‌తేజ్‌ మరణంపై సినీ, టివి ఆర్టిస్టు అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హుందాల్ మృతికి సంతాపం తెలియచేసారు. నవ్‌తేజ్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కూతురు అవంతిక హుండల్‌ పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. నటించటం మాత్రమే కాదు నవ్‌తేజ్‌ నటనలో శిక్షణ కూడా ఇస్తుంటారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -