Monday, April 29, 2024
- Advertisement -

దుమ్మురేపుతున్న ‘సత్యమేవ జయతే’ సాంగ్!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ ఇప్పుడు సినిమా హీరోనే కాదు.. రాజకీయ నేతగా తన సత్తా చాటుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాత వాసి తర్వాత ఏపిలో జరిగిన ఎన్నికల బిజీలో గడిపారు పవన్ కళ్యాన్. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేశారు.

ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌, మగువ మగువ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా వకీల్ సాబ్ సినిమా నుంచి 2వ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే పాపులర్ సింగర్ శంకర్ మహదేవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ చిత్రంలో పాడిన ‘సత్యమేవ జయతే’ సాంగ్‌ను రిలీజ్ చేసి, గ్రాండ్ గా విసెష్ చెప్పారు టీం యూనిట్. ఈ సాంగ్ లో పవన్ కి సంబంధించిన క్లిప్స్ ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తున్నాయి.

జనం కోసం, న్యాయం కోసం పోరాడే ఓ వకీల్ సాబ్ గా పవన్ కళ్యాన్ ఓ రేంజ్ లో ఆకట్టు కోబోతున్నట్లుంది. సత్యమేవ జయతే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ పాటతోనే సినిమా ఎలా ఉండబోతోందో అని చెప్పకనే చెప్పారు మేకర్స్. ప్రజా సమస్యలపై పోరాడి, వారి పక్షాన నిలబడేందుకు ఎంతకైనా తెగించే పాత్రలో పవన్ అలరించనున్నాడు. పాటలో కూడా ఇదే విషయాన్ని చూపించారు.

ఈ పాటను శంకర్ మహదేవన్, ప్రిద్వి చంద్ర పాడగా, రామజోగయ్య శాస్త్రి రచించారు.ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -