Wednesday, May 1, 2024
- Advertisement -

మహర్షి తర్వాత వంశీ చూపు ఎటు?

- Advertisement -

మహేష్ బాబు ని సరి కొత్త గా చూపించడమే కాకుండా మూడు విభిన్న పాత్రల్లో కూడా తమ అభిమాన హీరోని మన అందరికీ పరిచయం చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పుడు ఇండస్ట్రీ లో డిమాండ్ ఉన్న దర్శకుడు. మహేష్ బాబు ఊహించని రేంజ్ లో సక్సెస్ ని అందించి అందరినీ ఆశ్చర్య పరిచాడు వంశీ. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటి కి అయితే ఈ విషయం మీద క్లారిటీ లేదు కానీ ఇండస్ట్రీ లో తిరుగుతున్న రూమర్స్ ప్రకారం వంశీ కి ఒక మెగా హీరో నుండి పెద్ద ఆఫర్ అందిందట.

ఇంతకు ముందు కూడా వంశీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండో సారి పని చేయనున్నాడు అనే వార్తలు వచ్చాయి కానీ ఇటు దర్శకుడు కానీ అటు హీరో కానీ స్పందించలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం మరి కొద్దీ రోజుల్లో వంశీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ కోసం పని చేయనున్నాడట. కొద్దీ రోజులు బ్రేక్ తీసుకొని, మహర్షి హాంగౌర్ నుండి బయటకు వచ్చి ఈ సినిమా కోసం కసరత్తు ఆరంభిస్తాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -