దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా ‘భైరవ గీత’. వర్మ డైరక్షన్ డిపార్టమెంట్‌లో పనిచేసిన సిద్ధార్థ్ తథోలును దర్శకుడిగా పరిచియం చేస్తు ఈ సినిమాను నిర్మిచాడు రామ్ గోపాల్ వర్మ.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాయలసీమలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ట్రైలర్ ను బట్టి సినిమాలో హింస, రక్తపాతం, యాక్షన్ తదితర అంశాలు ఓ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించి కారణంగా హీరో తమ కుటుంబాన్ని కోల్పోవడం, ఊరు రెండుగా చీలిపోవడం.. పగ తీర్చుకోవడానికి హీరో రాక్షసుడిలా మరి తన కక్షను సాధించి ఎలా ప్రేమను పొందాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక వర్మ తనదైన స్టైల్లో ట్రైలర్‌లో ఘాటైన ముద్దుసీన్లను కూడా చూపించాడు. ట్రైలర్ లిప్ లాక్‌లతో నిండిపోయింది.