Saturday, April 20, 2024
- Advertisement -

వితిక సూసైడ్ అటెంప్ట్ వెనక అసలు కథ ఇదే..!

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ద్వారా వరుణ్ సందేశ్- వితిక షెరు లకు బాగా క్రేజ్ పెరిగింది. అయితే బిగ్ బాస్ కంటే ముందు వితిక వార్తల్లో నిలిచి సంచలనం రేపిన విషయం తెలిసిందే. సూసైడ్ అటెంట్ చేసిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో వరుణ్, వితికల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఆ కారణం వల్లే వితిక సుసైడ్ కి ప్రయత్నించిందని వరుస కథనాలు వచ్చాయి. అయితే అదే నిజమని అంత నమ్మారు.

కానీ దీని వెనక అసలు కథ వేరే ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వితిక తన తదుపరి పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూళో పలు ఆసక్తికర విషయాలకు సమాధానలు చెప్పింది. అమెరికా వాతవరణానికి అలవాటు పడిన తనకు ఇండియా వచ్చిన తర్వాత పెద్దగా నిద్రపట్టేది కాదని.. ఆ కారణం వల్లే తొలిసారి నిద్ర మాత్ర వేసుకున్నానని.. మోతదుకు మించి నాలుగు టాబ్లెట్లు వేసుకోవడంతో ఘాడ నిద్రలోకి జారుకున్నానని చెప్పింది.

అది చూసిన మా అమ్మకు భయమేసి తనని ఆసుపత్రికి తీసుకెళ్ళిందని.. ఆ టైంలో నా ఫోన్లో తీసిన ఓ ఫోటో నా స్నేహితురాలికి వెళ్లడం.. ఆమె దాన్ని బయట్కి వదలడంతో పెద్ద ఇష్యూ అయిందని.. దాన్ని ఆధారంగా చేసుకుని తాను ఆత్మహత్యాకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగిందని చెప్పింది. మొత్తానికి ఆ సూసైడ్ వెనక ఉన్న అసలు కథను వితిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హీరోయిన్ గా కూడా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వరుణ్ కూడా తన పయత్నాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -